సుభాష్ కాలనీలో కూలిన రేకుల షెడ్డు
భూపాలపల్లి జూలై 16 (Akshara saval): భూపాలపల్లి 16 వార్డు సుభాష్ కాలనీ లో సైడ్ కాలువ నిర్మాణం కోసం సోమవారం సాయంత్రం పూడిక తీసి వెళ్లారు. కాంపౌండ్ వాల్ ను ఆనుకొని పూడిక తీయడం వలన ఎండి షరీఫ్ పాషా ఇంటి నెంబర్13-158 రాత్రి కాంపౌండ్ వాల్ తో పాటు ఇంటి ముందు రేకుల షెడ్డు ఒకసారి గా కుప్ప కూలిపోయింది. గోడకు మరి దగ్గరగా మట్టి తీయడం వలన రేకులతో సహా కూలిపోయిందని ఆవేదన వ్యక్తపరుస్తూ తమకు న్యాయం చేయాలని షరీఫ్ పాషా వేడుకుంటున్నాడు.