Trending Now
Sunday, March 23, 2025

Buy now

Trending Now

తెలంగాణ రాష్ట్ర కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా..?

తెలంగాణ రాష్ట్ర కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా?
న్యూస్ డెస్క్ హైదరాబాద్, మే ౩౦ ( అక్షర సవాల్ ): 

తెలంగాణ రాష్ట్ర చిహ్నం కొత్త లోగో ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. చివరి నిమిషంలో ఈ కీలక నిర్ణయం తీసు కుంది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తు న్నట్లు తెలిపింది. ఈ కారణంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కేవలం తెలం గాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించింది. చర్చల తర్వాతే అధికార చిహ్నం ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా ప్రముఖు లతో చర్చలు జరుపుతున్నా రు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దు కోను న్నట్లు చెబుతున్నారు.

అయితే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని… ఇది సరికాదని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతు న్నాయి.

Related Articles

Latest Articles