ఇంటింటి ఫీవర్ సర్వే
మంగపేట, జూలై 27 ( అక్షర సవాల్ ) : ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాలాయిగూడెం, మల్లూరు, మొట్లగూడెం, నరసింహ సాగర్ గ్రామాలలో చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చిన్నపాక యమున ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే, డ్రై డే, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం తదితర కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ అధికారులతో, సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాలు చేసినట్లు డాక్టర్ యమున తెలిపారు. అనంతరం డాక్టర్ యమున ఆధ్వర్యంలో నరసింహ సాగర్ లో హెల్త్ క్యాంపు నిర్వహించారు. జ్వరం ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యమున, పీ.హెచ్.ఎన్ రాంబాయి, హెచ్.వి పద్మ, ఏఎంఎంలు సీతమ్మ, సారమ్మ, ఆశాలు పాల్గొన్నారు.