గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులా…?
– ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య
మంగపేట, పిబ్రవరి 23, అక్షర సవాల్:
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్టు చేయించి ఆనందాన్ని పొందుతున్న మంత్రి వివేక్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకుల సమావేశంలో చిట్టిమల్ల సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో గెలిచిన అహంకారం తప్ప ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేసిన సేవ ఏ కోణంలో చూసిన కనబడదు. చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బిఆర్ఎస్ పార్టీ నేతలను కార్పొరేటర్లుగా గెలిపిస్తే ఆ గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు చిట్టి మల్ల సమ్మయ్య నిమ్మగడ్డ ప్రవీణ్ కర్రీ శ్రీను బియ్యం శ్రీను బోడ ప్రసాద్ పట్టెం సందీప్ తెల్ల నగేష్ నిట్ట బన్ని దళిత నాయకులు పాల్గొన్నారు.


