Thursday, April 9, 2026

Buy now

హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన 

హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన 

జిల్లా వైద్యాధికారి గోపాలరావు

 

ములుగు ప్రతినిధి/మంగపేట, ఏప్రిల్ 09, అక్షర సవాల్: జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో హెల్త్- వీక్ లో భాగంగా  హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు హెచ్ఐవి స్క్రీనింగ్ క్యాంపులు వాక్ తాన్ నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు పత్రికా ప్రకటనలో తెలిపారు.గురువారం ములుగు డిఎం ఎండ్ ఎచ్ ఓ గోపాలరావు జి జి హెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ లు జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా  డిఎం హెచ్వో డాక్టర్ గోపాల్ రావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు పరీక్షల నివారణ చర్యలు కౌన్సిలింగ్ సెంటర్లు మరియు చికిత్స గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యవంతులను చేయాలని తెలిపారు. ఎయిడ్స్ నివారణలో ప్రజలు ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఈ వ్యాధిని వారించవచ్చునని వివరించారు.గ్రామాలలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గురించి గ్రామసభలలో ఇతర మీటింగ్ లలో మాట్లాడాలని తెలిపారు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల ఒకరి నుండి ఇంకొకరికి హెచ్ఐవి వైరస్ కలిగిన రక్త మార్పిడి వల్ల కలుషితమైన సిరంజిలా వల్ల సురక్షితం కానీ సంభోగం వల్ల ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందని కరచాలనము టాయిలెట్స్ ఈ వ్యాధి వ్యాప్తి చెందని వివరించారు.అనంతరం జిజిహెచ్ లో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమాల్లో జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ హెచ్ఐవి పరీక్షలు చేసుకోవాలని పోషకాహారం తీసుకోవాలని తెలిపారు.డిఎం అండ్ హెచ్ ఓ, జిజిహెచ్ సూపరిండెంట్ మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను సందర్శించి ట్రాన్స్ జెండర్స్ ఈ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని ఈ క్లినిక్ ప్రతి గురువారము ట్రాన్స్ జెండర్స్ కు వైద్య సేవలు అందిస్తుందని వివరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ ర్యాలీ జిజిహెచ్ ములుగు నుండి డిఎల్ఆర్ ఫంక్షన్ వరకు నినాదాలతో నిర్వహించారు మానవహారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగనేష్ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్పతి, ఫిజీషియన్ డాక్టర్ బిక్షపతి రావు, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధా హెల్త్ ఎడ్యుకేషన్ భాస్కర్ హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ డిస్టిక్ కోఆర్డినేటర్ జ్యోతి, రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, స్టాఫ్ నర్సులు,ఆశ వర్కర్లు,సిబ్బంది, మరియు హెచ్ఐవి మీద పనిచేస్తున్న దిశ సిపిఎం జ్యోతి, ఐసీటీసీ కౌన్సిలర్లు ,స్వచంధ సంస్థలైన మారి, లింక్ వర్కర్స్ సంపూర్ణ సురక్ష , నెట్వర్క్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles