IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని..!
- విద్యార్థినికి సహాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి
సిరిసిల్ల జిల్లా: జులై 24(అక్షర సవాల్ ):
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత JEE మెయిన్ లో,ST, 824వ ర్యాంకు సాధించారు.
పాట్నా IITలో సీటు వచ్చి నా.. చేరేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల్ని మేపుకొంటున్నారు.
మధులత విషయం తెలుసుకున్న సీఎం రేవంత్, ఆమెకు రూ. 1.5 లక్షల సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
డబ్బులేని ప్రతిభావంతులైన పిల్లలకు ఇలాంటి సాయాన్ని కొనసాగించాలని సీఎంను పలువురు కోరుతున్నారు…

