తాడ్వాయి జూలై 26 అక్షర సవాల్ :
ములుగు జిల్లా సమ్మక్క – సారలమ్మ తాడ్వాయి మండలంలో గల ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి కాక సంపత్(38) మృతి చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంపత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంపత్ మరణంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకన్నాయి. ఆయనకు భార్య ఆమని, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయిలలో ఒకరికి అంగ వైకల్యం గల బాలుడు ఉన్నాడు. కాగా, ఇటీవలే మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) కూడా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలు దవాఖానల్లో చికిత్స పొందాడు. ఇటీవల ఇంటికి వచ్చిన ముత్తయ్య శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిం చేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం తెల్లవారుజామున ఇంటి వద్దనే మృతిచెందాడు. ఇటీవల కాలంలో వరుసగా మేడారం పూజారులు మృత్యు వాత పడుతుండటం భక్తులను కలిచివేస్తున్నది.