Trending Now
Friday, September 6, 2024

Buy now

Trending Now

ఆగని ఎన్కౌంటర్ లు సరిహద్దుల్లో పేలుతున్న తూటాలు…!

ఆగని ఎన్కౌంటర్ లు సరిహద్దుల్లో పేలుతున్న తూటాలు…!
పోలీస్ ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి
వివరాలు వెల్లడించిన ములుగు జిల్లా ఎస్పీ శబరీష్

వాజేడు జులై 20 అక్షర సవాల్ : తెలంగాణ చతిస్గడ్ సరిహద్దుల్లో పోలీసుల ఎదురుకాల్పులు జరిగాయి పోలీసు తూటా పేలడంతో ఒక మావోయిస్టు మృతి మృతి చెందాడు దీంతో సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎదురుకాల్పులకు సంబంధించిన వివరాలు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ వెల్లడించారు వివరాలు ఈ విధంగా ఉన్నాయి చత్తిస్ ఘఢ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీస్ లు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శనివారం ఉదయం 07.00 గంటల ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీమల దొడ్డి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరవసారి గుట్ట సమీపంలో దాదాపు 20 మంది నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) తీవ్రవాదులు ఆలివ్ గ్రీన్ యూనిఫారం తుపాకులను ధరించి పోలీస్ వారి పై కాల్పులు జరిపడం జరిగింది.పోలీసులను చంపాలనే ఉద్దేశంతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూనే ఉండగా కాల్పులు ఆపాలని, ఆయుధాలు వదిలి లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, సీపీఐ మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే ఉండగా ఆత్మరక్షణ కోసం మా పోలీస్ పార్టీ కూడా ఎదురు కాల్పులు జరుపడం జరిగింది. ఈ ఎదురుకాల్పులు 15 నిమిషాలకు పైగా కొనసాగాయి, అవతలి వైపు నుండి కాల్పులు ఆగిపోగా ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయగా ఒక తుపాకీ గాయాలతో చనిపోయిన మావోయిస్టు క్యాడర్‌ ను కనుగొనగా సంఘటన స్థలం నుండి ఒక 9 ఎం ఎం కార్బైన్ తుపాకీ , తూటాలు మందుగుండు సామగ్రి, డిటోనేటర్, సిపిఐ మావోయిస్టు సాహిత్యం కిట్ బ్యాగులు, ఇతర రోజువారీ వినియోగ వస్తువులు లభించాయి. సంఘటన బీజపూర్ జిల్లా ఎల్మిడి పి ఏస్ పరిధిలో జరిగినందున అట్టి పి ఎస్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం జరిగిందిని ములుగు జిల్లా ఎస్పీ శబరి ఓ ప్రకటనలో తెలిపారు

Related Articles

Latest Articles