Trending Now
Tuesday, February 10, 2026

Buy now

Trending Now

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
నర్సంపేట, జూలై 23,(అక్షర సవాల్):పట్టణ కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్య శారద సందర్శించారు.ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని పలు వార్డులను కలియతిరిగి వర్ష కాలంలో వచ్చే జబ్బులకు జాగ్రత్తలు తీసుకోవాలి అని,పలు సదుపాయాల గురించి జిల్లా ఆసుపత్రి వైద్యులను సూచించారు.జిల్లా ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.రోగులకు అందించే ఆహారం గురించి ఆరా తీసి కొన్ని లోటుపాట్లను గమనించి ఆర్డీవో కృష్ణవేణి కి తనిఖీ భాధ్యత అప్పగించి, అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం మెడికల్ కళాశాలను సందర్శించి నిర్మాణ పనుల గురించి గుత్తేదారు ను అడిగి తెలుసుకుని పనుల్లో వేగం పెంచాలని సూచించారు.మెడికల్ కళాశాల ప్రాంగణం ను అందంగా తీర్చి దిద్దాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి వైద్యులు గోపాల్,మనోజ్ లాల్, విరిన్,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles