Trending Now
Trending Now

వృద్ధురాలి కోరికతో ఒక్కటైన బలగం… ఘనంగా 95వ జన్మదిన వేడుకలు

వృద్ధురాలి కోరికతో ఒక్కటైన బలగం
— ఘనంగా 95వ జన్మదిన వేడుకలు

మంచిర్యాల జిల్లా: మాదారం టౌన్ షిప్: అక్టోబర్ 1 (అక్షర సవాల్ ): 

నేటి ఆధునిక ప్రపంచం కంప్యూటర్ యుగంలో మానవ మనుగుడ ఊరుకులు , పరుగులతో కాలం వెళ్లదీస్తూ ఒకరిని వొకరు మర్చిపోతున్న వేళ. వొకరి తో వోకరు ఆప్యంగా పలుకరించుకునే తీరిక లేక బంధాలు బంధుత్వాలు ఫోన్ లకే పరిమితం కావడంతో ఓ వృద్ధురాలి కోరిక ఆ బలగాన్ని ఒక్కటి చేసింది.

వివరాల్లోకి వెళితే ..మంచిర్యాల జిల్లా మాదారం టౌన్ షిప్ కు చెందిన మేకల రాజమ్మ 95 ఇద్దరు కుమారులు,ముగ్గురు కూతుళ్లు ,వారికి వారి పిల్లలు పిల్లలు సుమారు 75 మంది బలగం. వొకరితో వోకరు, అందరూ ఒకేసారి కలుసుకోవాలంటే సవాలక్ష కారణాలు. అయితే ఏదైనా ఏదైనా అశుభం అయితే కూడా అందరూ వొకసారి కలిసే అవకాశం లేకపోవడంతో ఆ బా అందరినీ ఒకేసారి చూసి అందరితో ఆనందంగా గడపాలని కోరిక బలంగా మెదిలింది. దీనితో తన బలగనికి అల్టిమేటం జారీ చేసింది. తన పుట్టిన రోజుకు ఎవరికి ఎన్ని పనులు వున్న ఖచ్చితంగా రావాలని కోరింది. కురు వృద్ధురాలి కొరిమెరకు దేశ విదేశాల్లో వున్న తన బలగం మొత్తం సుమారు 75 మంది కుటుంబ సభ్యులు కదిలివచ్చి సుమారు 3రోజుల పాటు ఆ వృద్దురాలతో గడిపి ఆమె పుట్టిన రోజులు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ అద్భుత ఘట్టం అందరినీ ఆలోచింప చేసింది. కొడుకులు, కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్ళతో ఆ కుటుంబం సంతోషంగా గడపడటంతో ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేసింది.

Related Articles

Latest Articles