తెలుగుదేశం పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మొక్కిరాల జనార్దన్ రావు ని నియమిస్తూ ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం నియామక పత్రము అందజేశారు.
ఈ సందర్భంగా టిడిపి భూపాలపల్లి కోఆర్డినేటర్ గా నియామకం అయిన జనార్ధన్ రావు మాట్లాడుతూ పార్టీ కోఆర్డినేటర్ నియమించినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇది తెలుగుదేశం పార్టీ పట్ల సిద్ధాంతం పట్ల చూపెట్టిన అంకితభావం, క్రమశిక్షణకు దక్కిన గుర్తింపు గా భావిస్తున్నానన్నారు. ఈ నియామకాన్ని ప్రోత్సాహంగా, బలంగా పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకొని పోయి, ప్రజల అభిమానాన్ని పొంది తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని జనార్ధన్ రావు తెలిపారు.