Trending Now
Saturday, October 5, 2024

Buy now

Trending Now

గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు

*గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు*

*1) పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తించిన ఫోటో ఐడెంటిటీ కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్….) తప్పనిసరిగా తీసుకోని రావాలి.*

*2) హల్ టికెట్ పై అభ్యర్థి సంతకం, ఫోటో స్పష్టంగా తెలియాలి. అభ్యర్థులు హల్ టికెట్ పై ఫోటో, సంతకం చెక్ చేసుకోవాలి, హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా లేని పక్షంలో గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని రావాలని లేనిపక్షంలో పరీక్షకు హజరు కాలేరు.*

*3) ఉదయం 8 గంటల నుండి 9.45 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2.15 గంటల వరకు పరీక్షా సెంటర్ లోనికి అభ్యర్థులకు అనుమతి ఉంటుందని, సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా సమయానికి ముందస్తుగా వచ్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రంలో కేసులు అభ్యర్థులు మందస్తుగానే చెక్ చేసుకోవాలి.*

*4) అభ్యర్థులు తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు , సెల్ ఫోన్, బ్లూ టూత్, క్యాలికులేటర్, మ్యాథ్స్ లాగ్ టెబుల్, పెన్ డ్రైవ్, చార్టర్స్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్ , ఇత, గ్యాడ్జెట్స్ తీసుకొని రావద్దని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొవాలని,షూ వేసుకోరాదని తెలిపారు.*

*5)అభ్యర్థులు ఓఎంఆర్ షిట్ పై సూచనలు చదవాలని, హల్ టికెట్ నెంబర్, ప్రశ్నా పత్రం నెంబర్ సరిగ్గా నమోదు చేయాలని, ప్రశ్న పత్రంలో 150 ప్రశ్నలను సరి చూసుకోవాలని,150 ప్రశ్నలు లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్ కు సమాచారం అందించాలి.*

*6) ఓఎంఆర్ షిట్ పై బ్లూ,బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలని, ఇంక్ పెన్ను, జెల్ పెన్, పెన్సిల్ వాడరాదు.*

*7) పరీక్ష ప్రారంభానికి ముందు, ముగిసే సమయంలో లాంగ్ బెల్ మోగుతుంది. పరీక్షా హల్ లో ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగుతుందని, పరీక్ష ప్రారంభమైన అరగంటకు 1 బెల్, గంటకు 2 బెల్స్, గంటన్నర కు 3 బెల్స్ ,2 గంటలకు 4 బెల్స్ , 2 గంటల 25 నిమిషాలకు వార్నింగ్ బెల్ మోగుతుందని , దినికి అనుగుణంగా అభ్యర్థులు పరీక్ష రాయాలి.*

*8) ఓఎంఆర్ షిట్ పై అభ్యర్థులు తమ సంతకం చేసి ఇన్విజిలేటర్ సంతకం తప్పక తీసుకోవాలి.*

*9) అభ్యర్థులు ప్రశ్నాపత్రం పై ఎలాంటి రాతలు సమాధానాలు మార్క్ రాదు.*

*10) ఓఎంఆర్ షిట్ పై అభ్యర్థి పొరపాటు చేస్తే దాన్ని మరో ఓఎంఆర్ షీట్ తో భర్తీ చేయడానికి వీలు లేదు.*

*11)పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ అప్పజెప్పిన తర్వాత ఎడమచేతి బొటనవేలు థంబ్ బయోమెట్రిక్ ఇవ్వాలి*

Related Articles

Latest Articles