బాబు జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శనీయం : ఎస్పి
భూపాలపల్లి, ఏప్రిల్ 5(అక్షర సవాల్):
బాబు జగ్జివన్ రామ్ సేవలు చిరస్మణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాజీ ఉపప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల కోసం బాబు జగ్జీవన్‌రామ్ కృషి చేశారన్నారు.జగ్జీవన్‌రామ్ అందరికీ అదర్శప్రాయుడని కొనియాడారు. వివక్ష లేని సమాజం కోసం జగ్జీవన్ రామ్ కృషి చేశారని, దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారన్నారు. కుల రహిత సమాజం కోసం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్‌రామ్ కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఏఆర్ స్పెషల్ పార్టీ, సిబ్బంది పాల్గొన్నారు.