Trending Now
Trending Now

సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి :  ఎస్పి

సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి :  ఎస్పి

భూపాలపల్లి, ఏప్రిల్ 3(అక్షర సవాల్):

పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగానే, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఒకరిని సైబర్ వారియర్ గా నియమించి వారికి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు అందజేయడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే  అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతనంగా సైబర్ క్రైమ్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎన్ సుభాష్ బాబు, ఎస్పి ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పి  మాట్లాడుతూ సైబర్ నేరాలను నియంత్రించడం, ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కలిగివుండాలని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ సెక్యూరిటీ ప్రతినిధిని కేటాయించామని, సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే 1930 కి కాల్ చేయడం గానీ, ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటేనే గుర్తించడం సులువవుతుందని ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  ఎస్బీ,  డీసీఆర్బి  ఇన్స్పెక్టర్లు వసంత్ కుమార్, రామకృష్ణ, సైబర్ సెల్ కో ఆర్డినేటర్ స్వామి గౌడ్  పాల్గొన్నారు.

Related Articles

Latest Articles