Monday, May 27, 2024

ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ టూర్ ఖరారైంది..?

జూలై 8న వరంగల్ కి ప్రధాని నరేంద్ర మోడీ..!

  • కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, మెగా టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన

వరంగల్ జూన్ 29 ( అక్షర సవాల్ ):  తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఖరారైంది. జూలై 8న వరంగల్ జిల్లాలో నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని టూరు కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. ఈ సందర్భంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర బీజేపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు 8న హైదరాబాద్లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడినట్లు సమాచారం

Related Articles

Latest Articles