భూపాలపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ పక్రియ
-జిల్లాలోని మావో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి, నవంబర్ 30 (అక్షర సవాల్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రశాంతoగా పోలింగ్ పక్రియ ముగిసింది, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు, సిబ్బందికి నిరంతరం అందుబాటులో ఉండి, మావోయిస్ట్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అయా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, సూచనలు ఇస్తూ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా ఎస్పి పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూంకు తరలించడం జరిగింది. ఈ సందర్బంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల విధుల్లో సమర్థంతంగా పనిచేసిన సీఆర్పీఎఫ్, ఛత్తీస్ఘడ్ పోలిసు సిబ్బంది, జిల్లా పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ కిరణ్ ఖరే ప్రత్యేకంగా అభినందించారు.-స్ట్రాంగ్ రూం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పి
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోని సీఈఆర్ క్లబ్, మినీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్స్ మరియు స్ట్రాంగ్ రూమ్ ల భద్రత పరమైన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పరిశీలించారు. ఈవీఎంల భద్రతకై ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు మరియు కౌంటింగ్ హాలులవద్ద పూర్తిస్థాయిలో అవసరమయిన పటిష్ట భధ్రతకై కేంద్ర సాయుధ బలగాలతో పాటు జిల్లా పోలీసులు విధుల్లో ఉన్నారని అన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని కౌంటింగ్ ముగిసే వరకు ఎటువంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఎస్పి పేర్కొన్నారు.