బారికేడ్లను తొలగించి భాదను తీర్చారు…
నర్సంపేట, జూలై 23,అక్షర సవాల్:పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారులు పలు చోట్ల దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి.తద్వారా ప్రయాణికులు,పాదచారులు,వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గుంతలు పెద్దగా ఉన్నచోట బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేశారు.ఈ విషయాన్ని గమనించిన పురపాలక కమిషనర్ శ్రీనివాస్ కంకరతో కూడిన చూరను గుంతలలో పోసి తాత్కాలికంగా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేశారు.కొన్ని గుంతలు మిషన్ భగీరథ మరియు అభివృద్ధి పనుల మూలంగా ఏర్పడిన గుంతలు.వాటి నివారణ భాధ్యత అభివృద్ధి పనులు చేసిన గుత్తేదారుదే.పనులు ముగిశాక ఇంజినీరింగ్ శాఖ అధికారులు సరిగా పట్టించుకోక పోవడం మూలంగా ఈ గుంతలు ఏర్పడి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తూ, ప్రమాదాలకు నెలవుగా మారాయి.కమిషనర్ శ్రీనివాస్ చొరవ తీసుకుని తాత్కాలికంగా చేస్తున్న ప్రయత్నాలను శాశ్వత ప్రాతిపదికన జరిగే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
బారికేడ్లను తొలగించి భాదను తీర్చారు…
