ఆదివాసీల కోసం ఉద్యమించిన నేత జైపాల్ సింగ్ ముండా
మంగపేట, జనవరి 03 ( అక్షర సవాల్ ) : తన జీవితాంతం ఆదివాసీల కోసం ఉద్యమించిన మహా నేత జైపాల్ సింగ్ ముండా అని మన్యసీమ పరిరక్షణ సమితి ( డోలు దెబ్బ ) రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ ప్రజా సంఘాల మంగపేట మండల కమిటీ సలహాదారు గొప్ప వీరయ్య అన్నారు. జైపాల్ సింగ్ ముండా 122 వ జయంతి వేడుకలను ఆదివాసీ ప్రజా సంఘాల ( మన్యసీమ పరిరక్షణ సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ సేన ) ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో జైపాల్ సింగ్ ముండా విగ్రహ ప్రతిష్ట ప్రతిపాదిత స్థలంలో ఘనంగా నిర్వహించారు. జైపాల్ సింగ్ ముండా జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, జైపాల్ సింగ్ ముండా చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు నల్లెబోయిన లక్ష్మణ్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మన్యసీమ పరిరక్షణ సమితి ( డోలు దెబ్బ ) రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ ప్రజా సంఘాల మంగపేట మండల కమిటీ సలహాదారు గొప్ప వీరయ్య మాట్లాడుతూ జైపాల్ సింగ్ ముండా భారత రాజ్యాంగంలోని 5వ,6వ షెడ్యూలు రచించిన రాజ్యాంగ నిర్మాత అని, ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమించిన మహా నాయకుడు అన్నారు. నేడు ఆదివాసీలు అనుభవిస్తున్న హక్కులు జైపాల్ సింగ్ ముండా రచించిన 5వ,6వ షెడ్యూలు పుణ్యమేనని అన్నారు. అలాంటి మహనీయుడిని ప్రతీ ఆదివాసీ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు గొప్ప వీరయ్య, మాజీ జడ్పీటీసీ గుమ్మడి సోమయ్య,అయ్యోరి యానయ్య, తోలెం నర్సింహా రావు, పోలెబోయిన ఆదినారాయణ, తాటి నాగరాజు, పూనెం రాములు, కొమరం రవి, అన్నెబోయిన సమ్మయ్య, మద్దెల అంజయ్య, జబ్బ రవి, పోదేం నాగేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాంరెడ్డి, వెంకటేశ్వర్లు, భగవాన్ రెడ్డి, పూజారి సురేందర్ బాబు, గుగ్గిల్ల సురేష్,రాజమల్ల సుకుమార్, ఎంపెల్లి మల్లేష్, ఆదివాసీ నాయకులు కబ్బాక లక్ష్మణ్, మారబోయిన గోవర్ధన్, తోలెం సుధాకర్, కుర్సం రమేష్ తదితరులు పాల్గొన్నారు.