ప్రో. జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయం : డిఎస్పీ
భూపాలపల్లి, ఆగస్టు 6(అక్షర సవాల్):
ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని భూపాలపల్లి డిఎస్పీ ఏ. సంపత్ రావు అన్నారు. మంగళవారం ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ సంపత్ రావు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయుడు జయశంకర్ అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని ఆయన ఆశయాలను కొనసాగించడమే ప్రజలు ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని డిఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, రిజర్వు ఇన్స్పెక్టర్ రత్నం, సీసీ ఫసియొద్దీన్ జిల్లా పోలిసు కార్యాలయ సిబ్బంది, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.