
పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి
విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి
ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం
మండల విద్యాధికారిని పొదేం మేనక
మంగపేట, జూన్ 13, అక్షర సవాల్:
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జూన్ 14 తో వేసవి సెలవులు ముగిసాయి. దీనితో పాఠశాలలు సోమవారం జూన్ 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయని మండల విద్యాధికారిని పొదేం మేనక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యాధికారిని మాట్లాడుతూ విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలని విద్యార్థులు తగిన సామగ్రి (పుస్తకాలు) తో నిర్ణీత సమయానికి పాఠశాలకు హాజరు కావాలని అన్నారు.
పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి:
పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయబడ్డాయని విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ సమగ్ర అభివృద్ధికి పాఠశాలల ఉపాధ్యాయుల బృందం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి:
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సమయానికి పాఠశాలకు పంపించి ఉపాధ్యాయులకు సహకరించాలి.
ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం:
మండలంలోని రాజపేట ఎంపీపీఎస్, కొత్త బెస్తగూడెం ఎంపీయూపీఎస్, మల్లూరు జడ్పీహెచ్ఎస్, కమలాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో నూతనంగా ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కాను ఉన్నాయని మండల విద్యాధికారిని మేనక తెలిపారు.

