మండల మెడికల్ అసోసియేషన్ పూర్తి మద్దతు
మంగపేట, మే16, అక్షర సవాల్: మే 20 న జాతీయ స్థాయిలో మందుల దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి.ఆన్‌లైన్ ఫార్మసీల ఇష్టారాజ్య విక్రయాలను భారీ డిస్కౌంట్లను నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసిడి) జాతీయ స్థాయి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగపేట మండల కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కూడా ఈ బంద్‌కు పూర్తి మద్దతును తెలుపుతూ మండల మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏఎస్ఐ శ్రీకాంత్ కు అదేవిధంగా మండల తహసీల్దార్ తోట రవీందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి సెక్రటరీ సామల సాంబశివరావు కోశాధికారి శ్రీనివాసరెడ్డి అసోసియేషన్ సభ్యులు బండారి రమేష్ గోస్కుల చంద్రమౌళి పాల్గొన్నారు.



