గాంధీజీ ఆశయాలను సాకారం చేయాలి : జిల్లా ఎస్పి
భూపాలపల్లి, జనవరి 30(అక్షర సవాల్):
ప్రతీ ఒక్కరు గాంధీజీ ఆశయాలను సాకారం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంతో మంది మహానీయుల త్యాగఫలమే స్వాతంత్రమని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయుధం లేకుండా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి గాంధీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నరేష్ కుమార్, వర్టికల్ డిఎస్పీ నారాయణ నాయక్, జిల్లా పోలీసు కార్యాలయ ఏవో వసిం ఫర్జానా, డీపీఓ సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, సిసి ప్రదీప్ కుమార్,డీసీఅర్బీ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీకాంత్, నగేష్, రత్నం, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.