Trending Now
Trending Now

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు : ఎస్పి కరుణాకర్

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్

భూపాలపల్లి, అక్టోబర్ 1(అక్షర సవాల్):

సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని జిల్లా పోలీసులు నిరంతరం గమనిస్తారని అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేయవద్దని, వ్యక్తిగత దూషణకు దిగడం, వార్నింగ్ ఇవ్వడం, అంతర్గత వివరాలు గురించి అనవసర పోస్టులు, కామెంట్స్, సోషల్ మీడియాలో పెట్టవద్దని,సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని తప్పుడు, రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదిక గా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేస్తే, తగిన చర్యలు తప్పవని ఎస్పి కరుణాకర్  హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని, లేదంటే తగిన పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా యువత, వారి భవిష్యత్తును అనవసర పోస్ట్ ల ద్వారా నష్టపరుచుకోవద్దని ఎస్పి  సూచించారు.

Related Articles

Latest Articles