ఎంజీఎం హైస్కూల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
భూపాలపల్లి, అక్టోబర్ 2(అక్షర సవాల్):
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ఎంజీఎం హైస్కూల్ యందు 154 వ గాంధీ జయంతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని ,విద్యార్థులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరై గాంధీజీ సిద్ధాంతాలు, అతని స్వాతంత్ర పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ అతని ఆచరణ యోగ్యమైన విషయాలను పాటించాలంటూ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ ఈ ప్రపంచానికి సత్యాగ్రహం ,అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు అని గాంధీజీ ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించాడంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు అని గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్న మాటలు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి ,గ్యాదంగి రమాదేవి ,సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.