Monday, May 27, 2024

మైలారం గుట్టపై వెలిసిన దేవుళ్ళకు ప్రత్యేక పూజలు చేసిన చందుపట్ల కీర్తి రెడ్డి

మైలారం గుట్టపై వెలిసిన దేవుళ్ళకు ప్రత్యేక పూజలు చేసిన చందుపట్ల కీర్తి రెడ్డి

నియోజకవర్గం భూకబ్జాదారులకు అడ్డాగా మారింది.

భూపాలపల్లి, సెప్టెంబర్ 29(అక్షర సవాల్):

భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల వల్ల భూకబ్జా దారులకు అడ్డాగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆరోపించారు. మండలంలోని మైలారం గుట్టపై బయటపడిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామీ , రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహాల దేవతామూర్తులను శుక్రవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వారు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం మనకు కండ్లకు కట్టినట్లుగా సాక్షాత్ భగవంతుడే వెలిసి తమ భూమిని కాపాడుకోవడానికి భక్తులకు దర్శనం ఇచ్చారన్నారు. మైలారం గుట్టను దోచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేకి భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలు ఓట్ల తో బుద్ధి చెపుతారని అన్నారు. ఆత్యాద్మిక క్షేత్రాలైన కాకతీయుల కోటగా నిలువబోతున్న రామప్ప, కోటగుళ్ళు, బుగులోని జాతర, పాండవుల గట్టు, మైలారం మల్లన్న, సున్నపు గుహలు ఉన్న సనాతన ధర్మాలు కండ్లకు కనిపించినట్టుగా సాక్షాత్తు భగవంతుడు స్వయంబుగా వెలిసిన గుట్టను కూడా లీజుల పేరుతో కబ్జాకు ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే బినామీ కంపెనీల లీజు ను ఆపివేసి మైలారం నిరుపేద ప్రజలకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహిమాన్వితం గల మైలారం గుట్ట పై వెలసిన దేవుళ్ళ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి దేవతలకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన గణపురం మండలం ప్రజలు, మైలారం గ్రామస్తులు మీరు ఎక్కడ తిరిగినా అడ్డుకుంటారని కీర్తి రెడ్డి హెచ్చరించారు. వారి వెంట బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు జిట్టబోయిన సాంబయ్య, మండల నాయకులు అయిత నరేష్, చందు, దామోదర్ , గ్రామస్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles