అక్షర సవాల్ ,సెప్టెంబర్ 20 ,డెస్క్ తెలంగాణ
చింతపల్లి నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న పీఏ పల్లి మండలం అక్కంపల్లికి చెందిన మద్దిమడుగు ప్రసాద్ తన భార్య, కుమారుడితో కలిసి కొండమల్లేపల్లి వైపు వెళ్తుంటే మల్లేపల్లి వైపు నుండి చింతపల్లి వైపు వెళ్తున్న కారు బైకును ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురులో ప్రసాదు(38) అతని కుమారుడు అవినాష్ (12) అక్కడికక్కడే మృతి చెందగా. ప్రసాద్ భార్య మద్దమడుగు రమణకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో డ్రైవర్ పట్నపు మణిపాల్(18) మృతి చెందగా, పులి పవన్, వారాల మణివర్ధన్, వనం మల్లికార్జున్ లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం చింతపల్లి పోలీసులు స్థానికుల సహాయంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
