భవిష్యత్ తరాలకు స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నింపాలి: ఎస్పి
-జిల్లా ప్రజలకు , పోలీస్ అధికారులకు , సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
భూపాలపల్లి, జనవరి 26(అక్షర సవాల్):
జిల్లా నూతన పోలీసు కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఎస్పి కిరణ్ ఖరే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాడు ఎందరో త్యాగధనుల ఫలితం, నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని, వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పి సూచించారు. ప్రజలకు చట్టం ప్రకారం పారదర్శకతతో ధనిక పేద అనే తేడా లేకుండా విధులు నిర్వర్తించాలని, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని పోలీసులకు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరు బాగా పని చేస్తున్నారని, అదే ఉత్సాహంతో మరింత బాగా పనిచేసి జిల్లా పోలీసు శాఖ కు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరేష్ కుమార్, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పి వి. శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు,డిపిఓ ఏవో ఫర్హానా, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, డిపిఓ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.