ఎన్నికల్లో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్
భూపాలపల్లి, అక్టోబర్ 31(అక్షర సవాల్):
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రౌడీ షీటర్లు, కేడి, సస్పెక్ట్ షిటర్లు ఏలాంటి గొడవలకు దిగవద్దని, ప్రవర్తనతో మెదలాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ అన్నారు. మంగళవారం రేగొండ మండల కేంద్రంలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్లో చిట్యాల సర్కిల్ పరిధిలోని 126 మంది రౌడీ, కేడి, సస్పెక్ట్ షీట్లతో డిఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా, ఎస్పి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాస్వామ్యయుత, స్వేచ్చ, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రౌడీ షీటర్ల పై ప్రత్యేకంగా ఉంటుందని, ఎన్నికల్లో ఎలాంటి నేరాలకు పాల్పడిన, గొడవలు దిగిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు, సత్ప్రవర్తనతో, సరైన నడవడిక ఉంటే రౌడీ, కేడి, సస్పెక్ట్ షిట్లను విచారణ జరిపి ఎత్తివేస్తామని ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ రాములు, చిట్యాల సిఐ వేణు చందర్, ఎస్ఐలు శ్రీకాంత్ రెడ్డి, సాంబమూర్తి, సుధాకర్, రమేష్, శ్రీధర్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.