Trending Now
Trending Now

ఫ్రీ అండ్ ఫేయిర్ గా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్ 

ఫ్రీ అండ్ ఫేయిర్ గా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్ 

భూపాలపల్లి, అక్టోబర్ 26 (అక్షర సవాల్):

ఫ్రీ అండ్ ఫేయిర్ (స్వేచ్చ మరియు నిష్పక్షపాత) గా ఎన్నికలను సమర్థవంంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే  ఐపిఎస్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్నికల విధులు,పెండింగ్ కేసులు, మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ల పైన ఎస్పి  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పి  మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికలను, ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛయుతంగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రతి ఒక్కరు కృత నిశ్చయంతో, 24 గంటలు అప్రమత్తతతో విధులను నిర్వహించాలని అన్నారు. ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు, మద్యం, ఇతర సామాగ్రి జిల్లాలోనికి ప్రవేశించకుండా చెక్ పోస్టుల వద్ద వివిధ శాఖల సమన్వయంతో కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి ఎస్పి  అడిగి తెలుసుకొన్నారు.

గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఏ ఏ అంశాలు క్రోడికరించాలన్న తదితర అంశాల గురించి పోలిసు అధికారులకు వివరించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, కేసుల్లో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎస్పి  తెలిపారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, మహిళలకు సంబంధించిన నేరాల్లో, పోక్సో, మరియు గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ పేర్కొన్నారు. అలాగే జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలిసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ (ఏఆర్) వి.శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, కాటారం డిఎస్పి జి. రామ్మోహన్ రెడ్డి ,వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, ఇన్స్పెక్టర్లు వేణు చందర్, రామ్ నర్సింహారెడ్డి, రంజిత్, కిరణ్, అజయ్ కుమార్, రవీందర్, రాజేశ్వరరావు, సూర్య ప్రకాష్ ,జిల్లా పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles