Monday, May 27, 2024

ఎంజీఎం హైస్కూల్ నందు ఘనంగా క్రిస్మస్ సంబురాలు

ఎంజీఎం హైస్కూల్ నందు ఘనంగా క్రిస్మస్ సంబురాలు

భూపాలపల్లి, డిసెంబర్ 23(అక్షర సవాల్):

గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ లోని ఎంజీఎం హైస్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిఎస్ఐ హోలీ మాన్యువల్ చర్చ్ విశ్వాసకులు, యేసు క్రీస్తు ఆరాధకులు పప్పెట్ షో ప్రదర్శన నిర్వహించి విద్యార్థిని, విద్యార్థుల చేత నృత్యాలు, నాటికలతో పాటు ప్రీ ప్రైమరీ చిన్నారులు శాంతా క్లాజ్ , మేరీ మాత వేషధారణలతో వివిధ ప్రదర్శనలు నిర్వహించి కేరింతలు, కోలాహలం చేస్తూ ఆద్యంతం అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ కుల, మత ,ప్రాంత ,జాతీయతకు క్రీస్తు జన్మదినం ఒక ప్రతీక అని ప్రపంచ దేశాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు డైరెక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు ,చాక్లెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి ,సిలివేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్,ఫాస్టర్ అనిల్ కుమార్, సిని, జోసెఫ్,కావ్య ,శ్రీవిద్య ,ఝాన్సీ మిగతా ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles