Trending Now
Trending Now

TS ; రాజన్న జిల్లా: సిరిసిల్ల జిల్లా లో చిరుత పిల్లల కలకలం

అక్షర సవాల్ ; రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి – 22
రాజన్న జిల్లా: సిరిసిల్ల జిల్లా లో
కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పిల్లల సంచారం కలకలం రేపుతోంది.

సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది. శుక్రవారం
తెల్లవారుజామున చిరుత పులి పిల్లలను తీసుకువెళుతుండగా పొలం పనుల కు వెళుతున్న రైతు చూసి కేకలు వేయడంతో

దీంతో చిరుత రైతుల అలజడి విని ఓ పిల్లను వదిలేసి వెళ్ళింది. చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు.

చిన్న చిరుతతో ప్రజలు సెల్ఫీలు దిగుతూ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు. సమాచారం అందుకున్న సంబంధిత అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పిల్లను కరీంనగర్ కు తరలించారు.

చిరుత పిల్ల లభ్యం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో చిరుత ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి..

Related Articles

Latest Articles