ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి : జిల్లా అదనపు ఎస్పీ
భూపాలపల్లి, ఆగస్టు 31(అక్షర సవాల్) :
ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్) బోనాల కిషన్ అన్నారు. శనివారం జిల్లా పోలిసు కార్యాలయంలో పోలిసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్సై జి బాలకిషన్, ఏఎస్సై సారంగపాణి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వి కుమారస్వామి లను అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులంతా కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయవద్దని, ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, కిరణ్, రత్నం, జిల్లా పోలిసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, ఉద్యోగ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.