[pj-news-ticker]
Friday, May 8, 2026

Buy now

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మానవత్వానికి ప్రతీక

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మానవత్వానికి ప్రతీక

మన హృదయాల్లో ప్రేమ ఉండాలి

మన చేతుల్లో సహాయం ఉండాలి

మన మాటల్లో ధైర్యం ఉండాలి

మన సమాజంలో మానవత్వం పెరగాలి

ఇవే రెడ్ క్రాస్ ఆశయాలు

“అక్షర సవాల్ స్పెషల్ స్టోరీ”

అక్షర సవాల్ ప్రతినిది మే 08: ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.ఈ రోజు మానవత్వానికి, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సహాయం చేసిన గొప్ప సేవా సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, వ్యాధులు, ప్రమాదాల సమయంలో రెడ్ క్రాస్ సేవలు అమూల్యమైనవి. మానవత్వమే మతమని ప్రపంచానికి చాటి చెప్పిన సంస్థ ఇదే.

రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యునాంట్: ఆయన జన్మదినమైన మే 8ను ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటారు.1859లో జరిగిన సోల్ఫెరినో యుద్ధం ఆయన మనసును కదిలించింది. ఈ యుద్ధం ఇటలీలో జరిగిన ఒక భయంకరమైన యుద్ధం.ఇది ఫ్రాన్స్ మరియు సార్డీనియా సైన్యాలు ఆస్ట్రియా సైన్యంపై విరుచుకుపడ్డ నేపథ్యం యుద్ధంలో వేలాది మంది సైనికులు గాయపడి తీవ్రంగా బాధపడ్డారు.ఆ గాయపడిన సైనికులను చూసి హెన్రీ డ్యూనాంట్ ఎంతో కలత చెందారు.ఆ సంఘటన ప్రభావంతోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపనకు మార్గం ఏర్పడింది.యుద్ధంలో గాయపడిన సైనికుల బాధలను చూసి ఆయన చలించిపోయారు.అందరికీ సహాయం చేయాలనే ఆలోచన ఆయనలో పుట్టింది.ఆ ఆలోచనతోనే రెడ్ క్రాస్ ఉద్యమం ప్రారంభమైంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 1863లో అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఏర్పడింది.తరువాత ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం అనేక దేశాలలో రెడ్ క్రాస్ శాఖలు పనిచేస్తున్నాయి.లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు సేవలందిస్తున్నారు. రెడ్ క్రాస్ చిహ్నం తెల్లని నేపథ్యంపై ఎర్ర క్రాస్ రూపంలో ఉంటుంది.ఇది ఆశకు, రక్షణకు సంకేతం.ఎలాంటి వివక్ష లేకుండా సేవ చేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం.జాతి, మతం, భాష, దేశ భేదాలు లేకుండా సహాయం అందిస్తుంది.అందుకే ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం లభించింది.

ప్రకృతి విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ ముందుంటుంది: వరదలు, భూకంపాలు, తుఫానులు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపడుతుంది.ఆహారం, దుస్తులు, మందులు అందిస్తుంది. నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయాలు కల్పిస్తుంది.ప్రజలకు ధైర్యం చెబుతుంది.కరోనా మహమ్మారి సమయంలో కూడా రెడ్ క్రాస్ సేవలు విశేషమైనవి.అనేక ప్రాంతాల్లో వైద్య సహాయం అందించింది.

రక్తదాన శిబిరాలు నిర్వహించింది:

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది.ప్రజల్లో అవగాహన కల్పించింది.రక్తదానం కార్యక్రమాలలో రెడ్ క్రాస్ పాత్ర ఎంతో గొప్పది.”రక్తదానం మహాదానం” అనే భావనను ప్రజల్లో పెంచింది.అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందిస్తు అనేక ప్రాణాలను కాపాడుతుంది.

యువతలో సేవాభావాన్ని పెంపొందిస్తుంది: రెడ్ క్రాస్ యువజన విభాగాలు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నాయి.విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవా భావం పెంపొందిస్తున్నాయి.ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి.ప్రథమ చికిత్సపై శిక్షణ ఇస్తున్నాయి.సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. మానవత్వం కోసం పనిచేయడం గొప్ప సేవ.ఇతరుల కష్టాల్లో తోడుగా నిలవడం నిజమైన మనిషితనం రెడ్ క్రాస్ అదే సందేశాన్ని ప్రపంచానికి అందిస్తోంది.సేవే పరమో ధర్మః అనే భావనను చాటుతోంది.ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.రక్తదానం చేయాలి.పేదలకు సహాయం చేయాలి.అనారోగ్యంతో బాధపడుతున్నవారికి తోడుగా నిలవాలి.ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనాలి.

సమాజ సేవకు సమయం కేటాయించాలి: యువత సేవా దృక్పథంతో ముందుకు రావాలి.విద్యార్థులు చిన్నప్పటి నుంచే సేవా గుణం అలవరుచుకోవాలి మనిషికి మనిషి సహాయం చేయడం గొప్ప విలువ.సమాజాభివృద్ధికి సేవాభావం అవసరం.రెడ్ క్రాస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.ప్రపంచ శాంతికి కూడా రెడ్ క్రాస్ కృషి చేస్తోంది. యుద్ధ బాధితులకు సహాయం అందిస్తోంది.శరణార్థులకు రక్షణ కల్పిస్తోంది చిన్నారుల ఆరోగ్యం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

మహిళల సంక్షేమానికి కృషి చేస్తోంది: ఆరోగ్య పరిరక్షణలో కూడా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తోంది.పేద ప్రజలకు ఉచిత వైద్య సహాయం చేస్తోంది.స్వచ్ఛంద సేవకుల త్యాగం అభినందనీయం.వారి సేవలు సమాజానికి ఆదర్శం.ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేయడం గొప్ప విషయం.మానవత్వానికి వారు నిజమైన సైనికులు.వారి సేవలను ఎప్పటికీ మరువలేం.ప్రతి దేశ అభివృద్ధికి మానవతా విలువలు అవసరం.ప్రేమ, కరుణ, సహాయం సమాజాన్ని బలపరుస్తాయి.రెడ్ క్రాస్ ఈ విలువలను ప్రపంచానికి నేర్పుతోంది మానవత్వమే నిజమైన మహోన్నతత అని చెబుతోంది. సేవలోనే ఆనందం ఉందని తెలియజేస్తోంది.ఈ సంవత్సరం రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి.యువతను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలి.

సమాజంలో మానవత్వాన్ని పెంపొందించాలి: మనమందరం కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే సమాజం మరింత అందంగా మారుతుంది.బాధలో ఉన్నవారికి అండగా నిలిస్తే అదే నిజమైన పండుగ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మనకు సేవా స్పూర్తిని గుర్తు చేస్తుంది.ఇది కేవలం ఒక దినోత్సవం మాత్రమే కాదు.మానవత్వానికి అంకితమైన మహత్తర ఉద్యమం.“మానవ సేవే మాధవ సేవ” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఇతరుల ప్రాణాలను కాపాడటం కన్నా గొప్ప పుణ్యం మరొకటి లేదు.రక్తదానం ద్వారా కొత్త జీవితం ఇవ్వవచ్చు సహాయం ద్వారా ఆశను నింపవచ్చు.

సేవ ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చు: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మనందరికీ సేవా బాధ్యతను గుర్తు చేస్తోంది.మనిషి కోసం మనిషి నిలబడాలని పిలుపునిస్తోంది.సమాజ హితం కోసం కృషి చేయాలని చెబుతోంది.ప్రేమ, కరుణ, సేవలతో ప్రపంచాన్ని నింపాలని సూచిస్తోంది. మానవత్వం చిరంజీవిగా నిలవాలని కోరుకుంటోంది.

నాగరాజు ముదిరి ఎమ్మెస్సి, ఎంఏఎంఈడీ

Related Articles

Latest Articles