ద్వితీయ మహాసభ విజయానికి కృషి చేయాలి
టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎనగందుల కొమురయ్య
ములుగు/మంగపేట ప్రతినిధి మే 14, అక్షర సవాల్: జిల్లా కేంద్రంలో మే15 న జరగబోవు ములుగు జిల్లా యూనియన్ ద్వితీయ మహాసభను విజయవంతం చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎలగందుల కొమురయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కొమురయ్య టియుడబ్ల్యూజే (ఐజేయు) గురించి మాట్లాడుతూ దాదాపు 65 ఏండ్ల ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన స్ఫూర్తితో నిరంతరం వర్కింగ్ జర్నలిస్టులకు సేవలందించే లక్ష్యంతో టీయూడబ్ల్యూజే 2014న ఆవిర్భవించింది.ఏప్రిల్ 19 2017 లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని లలిత కళాతోరణం లో 6వేల మంది వర్కింగ్ జర్నలిస్టులతో టీయూడబ్ల్యూజే ప్రధమ మహాసభను నిర్వహించుకోవడం జరిగింది. 2019లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ద్వితీయ మహాసభ జరిగింది. జూన్ 19,20- 2024లో ఖమ్మంలోని కామ్రేడ్ అమరనాథ్ హాల్లో (హరి కన్వెన్షన్) టియుడబ్ల్యూజే తృతీయ మహాసభను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. అదే విధంగా జర్నలిస్టుల హక్కుల సాధనలో పాత్రికేయుల సంక్షేమంలో అందరం ఐక్యతగా టీయూడబ్ల్యూజే ములుగు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో పనిచేయాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆశ చూపి మోసం చేసింది తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు ఇప్పుడున్న ప్రభుత్వంతో యూనియన్ పోరాడితే సాధ్యమన్నారు. కాబట్టి టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని మీడియా పాత్రికేయులుగా పని చేస్తున్న గత జిల్లా బాడీతో పాటు గతంలో ఐజేయు లో పనిచేసిన సీనియర్ జూనియర్ నూతన సభ్యులు యూనియన్ అభిమానులు ప్రతి ఒక్కరు మహాసభ విజయానికి కృషి చేయాలని, టీయూడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్ శేఖర్, ఉపాధ్యక్షులు గాడిపెళ్లి మధు ల ఆధ్వర్యంలో జరగబోయే ద్వితీయ మహాసభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

