[pj-news-ticker]
Monday, April 27, 2026

Buy now

బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ వైస్ చైర్మన్

బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ వైస్ చైర్మన్

 

పరకాల, అక్షర సవాల్: కంటాత్మకూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కుమ్మరి అన్వేష్ సతీమణి కీ.శే కుమ్మరి నీత ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎకు దివ్య–విద్య సాగర్ ఆదివారం సంతాపం తెలిపారు. నీత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఆయన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు భైరపాక భద్రయ్య, కోశాధికారి బొమ్మకంటి విజేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పొన్నం పూర్ణ చందర్, దాసరి పూర్ణ చందర్, అలాగే ఏకు మనోజ్, కిరణ్, ఈదునూరి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles