హేమాచలుడి సన్నిధిలో మల్టీ జోన్ ఐజి తరుణ్ జోషి
మంగపేట, ఆగస్టు 10 ( అక్షర సవాల్ ) : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల క్షేత్రంలో ( మల్లూరు గుట్ట పై ) కొలువైన శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామిని మల్టీ జోన్ ఐజీ తరుణ్ జోషి శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఐజీ తరుణ్ జోషికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రవణం సత్యనారాయణ, ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. ఐజీ తరుణ్ జోషి గోత్ర నామాలతో గర్భాలయంలో లక్ష్మీ నృసింహ స్వామికి పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు అనంతరం స్వామి వారి విశిష్టత, మహిమలు గురించి ఐజీ తరుణ్ జోషికి వివరించారు. అనంతరం ఐజీ తరుణ్ జోషికి వేదమంత్రాలతో ఆశ్వీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శేషవస్ర్తాలు అందచేసారు. ఆయన వెంట ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి తదితరులు ఉన్నారు.