సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ పర్యటన
-పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలకు సూచన
భూపాలపల్లి, అక్టోబర్ 31(అక్షర సవాల్):
త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ అన్నారు. మంగళవారం జిల్లా పరిధిలోని భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని సమస్యత్మక పోలింగ్ కేంద్రాలయిన వెలిశాల, చింతగుంటరామయ్యపల్లి, చల్లగరిగ, గోరీకొత్తపల్లి, పోలింగ్ కేంద్రాలను ఎస్పి సందర్శించి ప్రజలకు తగు సూచనలు చేశారు. ఈ సంధర్బంగా ఎస్పి గ్రామస్తులతో మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకావాలన్నారు. భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు ,సీఐ వేణుచందర్ ,ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి, సాంబమూర్తి ,సుధాకర్ ,రమేష్ ,శ్రీధర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.