Trending Now
Monday, October 28, 2024

Buy now

Trending Now

ఐదుగురు మావోయిస్ట్ సానుభూతి పరుల అరెస్టు

ఐదుగురు మావోయిస్ట్ సానుభూతి పరుల అరెస్టు..

పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  పుల్లా కరుణాకర్.

భూపాలపల్లి, సెప్టెంబర్ 23(అక్షర సవాల్):

23.09.2023 రోజున మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాలను పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  ఆదేశాలతో ఉదయం అడవిముత్తరం ఎస్సై డి. సుదాకర్ , పోలీసు సిబ్బంది మరియు  సీఆర్పీఎఫ్ పార్టీ కలసి యమాన్ పల్లి సెంటర్ దగ్గర వాహనాల తనఖి నిర్వహిస్తుండగా 5 వ్యక్తులు అనుమానాస్పదంగా మూడు ద్వీచక్ర వాహనాల మీద 1)TS 22 2317, 2)AP15AW8026, 3)TS16FD1796, మరియు 5 మొబైలు, 3 జిలెటిన్ స్టిక్స్, 3 డిటోనేటార్ , మావోయిస్ట్ సాహిత్య గ్రంధాలు మరియు కరపత్రాలు వారి అయిదుగిరి దగ్గర గల 21630 రూపాయలు కనబడగా వెంటనే వాహనలతో పాటూ ఆ వ్యక్తులను ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా వారు తెలిపిన వివరాలు ఏమనగా వారి పేర్లు దురిశెట్టి సాయిలు S/o మారయ్య 57 సంవత్సరాలు, కులం ధోబి, పాలకుర్తి మండలం రానాపూర్ గ్రామం , బొమ్మన కుమార్ S/o  పర్వతాలు, 32 ఏళ్ళు, కులం యాదవ , R/o రేపల్లెవాడ గ్రామం కమాన్‌పూర్ మండలం, పెద్దపల్లి జిల్లా,(పూర్వపు మావుఇస్ట్ సానుబుతిపరుడు ) , మెరుగు స్వామి S/o రాయలింగం, 50 సంవత్సరాలు, కులం గౌడ్ R/o కొత్తపల్లి, పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లా, ,(పూర్వపు మావుఇస్ట్ సానుబుతిపరుడు ) ,నిమ్మరాజుల శంకర్ S/o రాయమల్లు, 55 సంవత్సరాలు, కులం ధోబి, R/o రామారావుపల్లి పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన, ,(పూర్వపు మావుఇస్ట్ సానుబుతిపరుడు ),ముడు శివ కుమార్ S/o శ్రీనివాస్ 25 సంవత్సరాలు, కులం లంబాడ, R/o బామ్లా నాయక్ తండా, పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లా మావుఇస్ట్ భావాల మీద ఆకర్షణ కలిగిన వ్యక్తి ) వీరంతా పెద్దపల్లి జిల్లా లోని పాలకుర్తి మండలం మరియు చుట్టూ పక్కల మండలలలో నివసించువారు.

దురిశెట్టి సాయిలు S/o మారయ్య 57 సంవత్సరాలు, కులం ధోబి, పాలకుర్తి మండలం రానాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా అను అతను 1988 నుంచి 1996 వరకు PWG దేవన్న దళంలో పని చేసి 1996 లో సరెండర్ అయినాడు . ఇతను మరల మావోయిస్టులకు సహకరించాలని, అందు నిమిత్తం JMMWP డివిజన్, ఎటూరునాగారం మహాదేవపూర్ ఏరియా కమిటి సంయుక్త కార్యదర్శి ఈగోల్లపు మల్లయ్య ఆదేశాల మేరకు దామోదర్ @ బడే చొక్కా రావు లను కలసి పార్టి కొరకు పని చేస్తామని తెలిపి పార్టి కొరకు UG cadre ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగినిది. ఇందులో బాగంగా మావోయిస్టులకు గతం లో సహకరించిన మరియు మావోయిస్ట్ బావజాలం కలిగిన పైన తెలిపిన వ్యక్తులను తీసుకోని ఈ నెల 20 తారీకు రోజున ఛత్తీస్ గడ్ భీమారం కి వెళ్లి అక్కడ ఈగోల్లపు మల్లయ్య ని కలసి మావోయిస్టుల కొరకు పని చేస్తాము అను వారికీ చెప్పి తర్వాత వారు ఇచ్చిన మావోయిస్ట్ సాహిత్య రచనలను మరియు ఊర్లో వేయడానికి ఇచిన కరపత్రాలను మరియు 3 జిలెటిన్ స్టిక్స్ మరియు 3 డిటోనేటర్లు తీసుకుని నిన్నటి రోజు అనగా 22 తారీకు రాత్రి బయలుదేరి మార్గ మద్యములో పడుకొని వస్తుండగా ఈ రోజు ఉదయం 6 గంటలకు యమాన్ పల్లి వద్ద అడవిముత్తారం పొలిసు వారు పట్టుకున్నారని తెలపడం జరిగింది.

వారి దగ్గర 3 ద్వీచక్ర వాహనాలు 1)TS22 2317, 2)AP15AW8026, 3)TS16FD1796, మరియు 5 మొబైలు, 3 జిలెటిన్ స్టిక్స్, 3 డిటోనేటార్ , మావోయిస్ట్ సాహిత్య గ్రందాలు మరియు కరపత్రాలు వారి అయిదు గురు దగ్గర గల 21,630 రూపాయలు స్వాదినము చేసుకోవడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో కాటారం డిఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, సీఐ రంజిత్ రావు, అడవి ముత్తారం ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టబుల్ కిషన్, పిసిలు రాజేందర్, వినయ్ పాల్గొన్నారు.

Related Articles

Latest Articles