ప్రధాని పర్యటన బందోబస్తుపై సమీక్ష జరిపిన అడిషినల్ డిజిపి
వరంగల్ , జూలై 6 (అక్షర సవాల్) :
ఈ నెల 8వ తారీకున వరంగల్ వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డిజిపి విజయ్ అధ్వర్యంలో డిఐజి, ఎస్పీలు, ఎఎస్సీ స్థాయిలో అధికారులతో గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా భారత ప్రధాని పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన భద్రత ఏర్పాట్ల వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ అడిషినల్ డిజిపికి వివరించారు. ముఖ్యంగా ప్రధాని భద్రత కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందుస్తు చర్యలతో పాటు, హెలిప్యాడ్, రోడ్డుబందోబస్తు, భద్రకాళి దేవాలయం, బహిరంగ సభల వద్ద ఏర్పాటు చేయాల్చి భద్రత ఏర్పాట్లతో పాటు నిర్వహించాల్చిన విధులపై అడిషినల్ డిజి ఈ సమావేశంలో పాల్గోన్న అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సమావేశంలో డిఐజిలు సత్యనారయణ రెడ్డి, రమేష్నయుడుతో పాటు కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎస్పీలు, ట్రైనీ ఐపిఎస్ లు పాల్గోన్నారు.