Trending Now
Trending Now

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన  బీఆర్ఎస్ నాయకులు

రైతు బందు మరియు రుణమాఫీ నగదు బదిలీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన  బీఆర్ఎస్ నాయకులు

గణపురం, అక్టోబర్ 26 (అక్షర సవాల్):

రైతు బందు మరియు రుణమాఫీ నగదు బదిలీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ  గణపురం మండల కేంద్రంలో  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన గణపురం మండల బీఆర్ఎస్ నాయకులు.

ఈ సందర్బంగా భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు  మాట్లాడుతూ..రైతు బందు మరియు రుణ మాఫీ ప్రక్రియ ను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నాం అని, మరొమారు రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిరూపితం అయిందని అన్నారు, రైతులకు మూడు గంటల కరెంట్ చాలని 24 గంటల కరెంట్ అవసరం లేదని అన్న రేవంత్, ఈరోజు మల్లి రైతు బందు, రుణమాఫీ ఆపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రేవంత్ రెడ్డి ని మరియు కాంగ్రెస్ పార్టీ జరగబోయే ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు చేయాలనీ రైతులను, ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్,ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్,మంద అశోక్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి,అంబటిపల్లి సంపత్ రావు,సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి,అంపోజ్వాల రవీందర్ రెడ్డి, ఐలోని రాంచంద్రారెడ్డి,మామిడి నరసింహాస్వామి,బోయిని సాంబయ్య,దౌడు రమేష్, ముప్పిడి శంకర్,తాళ్ల హరిప్రసాద్,వడ్ల యాదగిరి,దౌడు రవికాంత్,రెక్స్ రవి, మార్క కుమార్,రవీందర్ రెడ్డి,పోశాల మల్లిక్,పూలెందర్ యాత్ నాయకులు గాజర్ల చింటు, దివి వంశీ, గుండెబోయిన రఘు, మాల నగేష్, రత్నం నవీన్, చక్రీ,శంకు,అమ్ము రియాజ్,సోషల్ మీడియా కన్వినర్ హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles