– స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
– రూ 41,500 ల ఫిక్స్ డిపాజిట్ అందజేత
మంగపేట, మే 09, అక్షర సవాల్: పూర్వ విద్యార్థుల దాతృత్వంతో సహచర స్నేహితు డి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలన్న సదుద్దేశంతో రూ 41,500 లు స్నేహితుని కుమార్తె పేరున పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేసి పత్రాన్ని పాపారావు భార్యకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని పొదుమూరు గ్రామానికి చెందిన బద్ది పాపారావు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు.స్నేహితుడి కుటుంబానికి భరోసా కల్పిస్తూ పూర్వ విద్యార్థులు శనివారం బద్ది పాపారావు కుటుంబాన్ని కలిసి సాయం అందించడమే కాకుండా స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని చాటుకున్నారు.స్నేహితుల సేవా భావాన్ని గ్రామస్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విభూది అమరలింగం కంకటి శరత్ కోడం నరేష్ ఈసంపల్లి సురేందర్ చల్ల రాంకీ సాయిని రాము షేక్ అజ్మత్ సోడే భూపతి బొమ్మనపోయిన శివకృష్ణ నరేష్ మిగిలిన మిత్రులు పాల్గొన్నారు.


