రేగొండ మండలం చెన్నాపుర్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ పుల్లా కరుణాకర్
భూపాలపల్లి, అక్టోబర్ 10(అక్షర సవాల్):
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేగొండ మండలం చెన్నాపూర్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తామని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు ప్రజలు తీసుకెళ్లవద్దని అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుందని, ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టే ఏలాంటి చర్యల కు దిగవద్దని, పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. చెక్ పోస్ట్ సిబ్బంది వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పి కరుణాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ వేణు చందర్, రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.