[pj-news-ticker]
Thursday, April 16, 2026

Buy now

ఆయుధ పూజ చేసిన ఎస్పి

ఆయుధ పూజ చేసిన ఎస్పి

భూపాలపల్లి, అక్టోబర్ 22 (అక్షర సవాల్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఎస్పీ  కిరణ్ ఖరే ఐపీఎస్  దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధపూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ పోలీసులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు కట్టుబడి ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరించాలని, రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.

చెడుపై మంచి సాధించిన విజ‌యానికి గుర్తుగా విజ‌య‌ద‌శ‌మి పండుగ‌ను జ‌రుపుకుంటార‌ని ఎస్పి పేర్కొన్నారు. స‌మాజంలో చెడును పార‌ద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుంద‌ని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసులకు, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.అర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డిఎస్పీ ఏ. రాములు, భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహరెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు నగేష్, కిరణ్, రత్నం, శ్రీకాంత్,  ఆర్ఎస్సై శివ, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles