గంజాయి మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి, చిట్యాల సిఐలు
భూపాలపల్లి, డిసెంబర్ 30(అక్షర సవాల్):
జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంతో మైనారిటీ పాఠశాలలో మరియు మొగుళ్ళపల్లిలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో గంజాయి మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సును భూపాలపల్లి సిఐ రామ్ నర్సింహా రెడ్డి, చిట్యాల సీఐ వేణు చందర్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని, డ్రగ్స్ గంజాయికి బానిసై వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఎవరైనా గంజాయి అమ్మితే ఉపేక్షించేది లేదని కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అమ్మేవారి పట్ల తగిన సమాచారం అందించాలని వారి పేరు గోప్యంగా ఉంచుతాయని, యువత, విద్యార్థులు గంజాయి కి దూరంగా ఉండి జీవితం లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే సైబర్ నేరాల పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం, ఓటిపి, ఏటీఎం కార్డ్ వివరాలు మరియు పిన్ నెంబర్ ఇతర సమాచారం ఇవ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి ఎస్సై శ్రీధర్, భూపాలపల్లి ఎస్సైలు శ్రీలత, శ్రావణ్, పాల్గొన్నారు.