Monday, May 27, 2024

ఎంజీఎం హైస్కూల్ విద్యార్థులు ఎస్జిఎఫ్ఐ నందు అంతర్ జిల్లా స్థాయికి ఎంపిక

ఎంజీఎం హైస్కూల్ విద్యార్థులు ఎస్జిఎఫ్ఐ నందు అంతర్ జిల్లా స్థాయికి ఎంపిక

భూపాలపల్లి, సెప్టెంబర్ 26(అక్షర సవాల్):

గణపురం (ము)చెల్పూర్ గ్రామంలోని ఎంజీఎం హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలలో భాగంగా అండర్ 14, అండర్ 17 ఖో ఖో,కబడ్డీ విభాగాల్లో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించి అంతర్ జిల్లా స్థాయి పోటీలకు 11 మంది విద్యార్థిని, విద్యార్థులు ఎంపికయ్యారు. సోమవారం మండలంలో జరిగిన జోనల్ స్థాయి పోటీలలో ఎంపికైన విద్యార్థులనుద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల మెరుగైన సమాజ స్థాపన జరుగుతుందని తద్వారా దేశ ప్రగతి పురోభివృద్ధిలో ఉంటుందని, తల్లిదండ్రుల ఆశయాలు ,పాఠశాల పేరు ప్రతిష్టలు పెంపొందించవచ్చునని తెలియజేసి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఈరల్ల మోహన్ ను, విద్యార్థిని, విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి , గ్యాదంగి రమాదేవి సిలువేరు శ్రీనివాస్, ప్రిన్సిపల్ మధుకర్ ,తల్లిదండ్రులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

Related Articles

Latest Articles