Trending Now
Trending Now

కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించిన ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్

కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించిన ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్

-ఎస్ హెచ్ ఓ  లు ప్రతి పోలింగ్ సెంటర్ ను సందర్శన చేసి, మౌళిక సదుపాయాలు, భద్రతా చర్యలు చేపట్టాలి

భూపాలపల్లి,అక్టోబర్ 20(అక్షర సవాల్):

అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించేలా పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి మిని ఫంక్షన్ హాల్ ను సందర్శించి అక్కడ కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను పరిశీలించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సైలు, సీఐలు పోలింగ్ కేంద్రాల సందర్శన చేసి, మౌళిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు, ప్రహారీ, త్రాగునీరు, భద్రత, తదితర అంశాలపై పునర్ పరిశీలన చేయాలన్నారు. ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని, గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయాలని వేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టెలా సమర్దవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పి  వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు, భూపాలపల్లి సిఐ రామ్ నర్సింహారెడ్డి, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్  అజయ్ కుమార్ పాల్గొన్నారు.

Related Articles

Latest Articles