Monday, May 27, 2024

ఆకు కూరలు తింటే ఎన్నో ప్రయోజనాలు.

Leafy Vegetables: ఆకు కూరలు తింటే ఎన్నో ప్రయోజనాలు.. ఏఏ ఆకుకూరలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి

మన ఆరోగ్యం మన చేతల్లో…. రోజు దొరికే ఆకుకూరల ఉపయోగాలు…తెలిస్తే అస్సలు మిస్ కాకుండా తీసుకుంటూ..దీర్ఘఆయువు పొందవచ్చు..

Health Benefits to Leafy Vegetables: మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.. ముఖ్యంగా నిత్యం ఆకు కూరలు తినడం వలన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకు కూరలు.. ఆకు కూరలను తింటే శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజూ ఏదొక రకంగా ఆకుకూరలను తింటే.. వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకు కూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతున్నారు.

ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకు కూరలు ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా.. సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కరివేపాకు:

సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటెమ్. చాలామంది కూరల్లో కర్వేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మేరుపడడానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేసే నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగా ఆహారంలో చేర్చుకున్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

కొత్తిమీర :

కొత్తిమిరిని కూడా చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే వంటలకు అదనపు రుచి , సువాసన అందించడానికి కొత్తిమీరను ఉపయోగపడుతుందని నమ్ముతారు. అయితే రుచి సువాసన ఇవ్వడమే కాదు.. ఈ కొత్తిమీర ఆస్తమా సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తుంది. రోజూ కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.

పుదీనా :

ఇక పుదినాతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వంటలకు అదనపు రుచి, మంచి స్మెల్ ను ఇవ్వడానికి పుదీనాని కూడా ఉపయోగిస్తారు. అయితే ఈపుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యల, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పర్ మెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటారు

తోటకూర:

ఆకుకూరల్లో ఎక్కువమంది కూరగా చేసుకుని తినేది తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందుకనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ని నిరోధిస్తుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటారు. జీర్ణం ఈజీగా అవుతుందని.. త్వరగా కోలుకుంటారని రోగికి తోటకూరను తినే ఆహారంలో చేరుస్తారు.

గోంగూర :

గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. తినడానికి కాస్త పుల్లగా అనిపాంచినా.. ఆ పుల్లటి రుచికలిగిన గొంగుర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. అందుకే ఇటీవల గోంగూర వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ గోంగూర పచ్చడి చాలా ఫేమస్.

బచ్చలి కూర:

బచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. ముఖ్యంగా శరీరం వేడి ఎక్కువగా ఉన్నవారికి బచ్చలికూర మంచి మేలు చేస్తుంది. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది. కనుక వేసవిలో తీసుకునే ఆకు కూరల్లో ఇది మొదటని చెప్పవచ్చు.

పాలకూర :

పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు.

సునాముఖి :

సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందించడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలోను , రక్త కణాలలోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో కూడా ఉపయోగ పడుతుంది. సునాముఖి మొక్కని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు బాగా సాగుచేస్తున్నారు. ఈ ఆకుని మలబద్ధకం ఉన్నవారు తింటే.. సమస్య నివారింపబడుతుంది. చారుగా చేసుకుని తింటే మలబద్దకం ఉండదు. గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

మెంతుకూర…

మధుమేహగ్రస్తులకీ. దివ్య ఔషధాలు…..

Related Articles

Latest Articles