ఎంజీఎం హైస్కూల్లో ఘనంగా ఫ్లవర్స్ డే దినోత్సవ వేడుకలు
భూపాలపల్లి, డిసెంబర్ 2 (అక్షర సవాల్):
గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్లో విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయినిలు ప్రకృతిలోని వివిధ రకాల పువ్వులను సేకరించి వాటి ఆకృతులను, రంగులను తెలియజేస్తూ నిజజీవితంలో మానవాళికి వాటి ప్రాధాన్యతను వివరిస్తూ ప్రైమరీ విద్యార్థులు పూల వేషధారణలతో, నృత్య ప్రదర్శనలు ,వివిధ అభినయాలు, ప్రదర్శిస్తూ ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒకరకమైన పువ్వు కావున విద్యార్థులందరూ ఈ ప్రపంచాన్ని అందమైన తోటగా మార్చండి, అదేవిధంగా పువ్వుల యొక్క రంగులు అవి వికసించినప్పుడు వెదజల్లే పరిమళం మాదిరి చైతన్యంతో, నేటి సమాజంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించి మీ కీర్తిని పతాక స్థాయికి చేరేటట్లు కృషి చేయండి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి ,గ్యాదంగి రమాదేవి ,సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, సహకరించి తోడ్పాటునందించిన ఉపాధ్యాయినిలు, సిని,వాణి, ఝాన్సీ,హీనా,లక్ష్మి ,శ్వేత ,కాళేశ్వరి లను అభినందించారు.