Trending Now
Trending Now

ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్

ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్

భూపాలపల్లి, అక్టోబర్ 25 (అక్షర సవాల్):

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్  బుధవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నానని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50వేల రూపాయల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారు పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు తగిన ఆధారాలను చూపాలని, లేని యెడల నగదు, ఇతర వస్తువులు, బంగారం ఆభరణాలు సీజ్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికలను ప్రజాస్వామ్య యుతంగా స్వేచ్ఛ మరియు నిష్పక్షపాతముగా నిర్వహించడమే లక్ష్యంగా జయశంకర్ జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని తెలియజేశారు.

Related Articles

Latest Articles