మహబూబాబాద్, జూన్24( అక్షర సవాల్ ): ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని ముదిరాజ్ మహాసభ నర్సింహులపేట మండల అధ్యక్షుడు మంద వెంకన్న డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో శనివారం ముదిరాజ్ జర్నలిస్టును కులం పేరుతో దూషించి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 22న హుజురాబాద్ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ముదిరాజ్ జర్నలిస్టును కులం పేరుతో కౌశిక్ రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజులు సుంకరి కృష్ణ, మంద సత్యం, అల్లి ఉపేందర్ తదితరులు ఉన్నారు.